రైతులకు సాగునీరు అందించేందుకు నియోజకవర్గంలో నీటి వనరులను గుర్తించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
'సాగునీరు అందించేందుకు నీటి వనరులను గుర్తించాలి' - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు సాగునీరు అందించేందుకు నియోజకవర్గంలో నీటివనరులను గుర్తించాలని ఆదేశించారు.
'సాగునీరు అందించేందుకు నీటివనరులను గుర్తించాలి'
నియోజకవర్గంలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు నారింజ బ్యారేజ్ ఎగువన, దిగువన పది చెక్‌డ్యాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బర్దిపాడ్, బూచినెల్లి, సత్వార్, చిరాగ్ పల్లి, జాడి మల్కాపూర్ గ్రామ శివార్లలోని వాగులపై 10 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు సిద్ధం చేసిన నమూనాలను పరిశీలించారు.
ఇవీ చూడండి: భవిష్యత్తులో వ్యవసాయం బంగారమయం: నాబార్డ్ ఛైర్మన్