నాటిన ప్రతి మొక్కను బతికించుకుంటేనే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం నిర్వహణపై నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు.
'ప్రతిమొక్క బతికినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుంది' - review on harithaharm programme
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న హరితహారం కార్యక్రమం నిర్వహణపై జహీరాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. నాటిన ప్రతి మెుక్కను బతికించుకుంటేనే హరితహారం లక్ష్యం నెరవేరుతుందన్నారు.
హరితహారంపై నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, ఐకేపీ ఏపీవోలతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా హరితహారం లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా నిర్వహించే హరితహారం కార్యక్రమంలో ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్