సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన - ఎమ్మెల్యే మాణిక్ రావు తాజావార్తలు
లాక్‌డౌన్ నుంచి కొన్ని సడలింపులివ్వటం వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మున్సిపాలిటీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రారంభించారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రారంభించారు. పట్టణంలోని దత్తగిరి కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేశారు. మున్సిపాలిటీలో విలీనమైన పంచాయితీల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.