సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక వర్గంలోని జర్నలిస్టులకు స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో వైద్యులు, పోలీసులు, అధికారులతో పాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా విలేకరులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం తరుపున జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, కొహీర్, న్యాలకల్ మండలాల విలేకరులకు నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు పంచారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శివ కుమార్, ఆర్డీవో రమేష్ బాబు, తహశీల్దార్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు పంచిన జహీరాబాద్ ఎమ్మెల్యే - ZaheeraBad MLA Manik Rao Distributes Groceries To Journalists
జహీరాబాద్ నియోజక వర్గంలో లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మీడియా ప్రతినిధులకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు నిత్యావసర సరుకులు పంచారు.
నిత్యావసర సరుకులు పంచిన జహీరాబాద్ ఎమ్మెల్యే