తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్వాంగ సుందరంగా జహీరాబాద్ చర్చి - జహీరాబాద్‌ చర్చి

క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని క్రీస్తు మందిరాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద చర్చిగా పేరొందిన జహీరాబాద్ రెవరెండ్ గార్గ్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

Zaheerabad Church in all its splendor for christmas
సర్వాంగ సుందరంగా జహీరాబాద్ చర్చి

By

Published : Dec 25, 2020, 8:01 AM IST

క్రిస్మస్ పర్వదిన వేడుకల సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని పలు చర్చిలు విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి. జిల్లాలోనే అతిపెద్ద చర్చిగా పేరొందిన జహీరాబాద్ రెవరెండ్ గార్గ్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని క్రీస్తు మందిరాలు విద్యుత్ దీపాలతో ధగధగా మెరిసిపోతున్నాయి. రెవరెండ్ గార్గ్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుటీరం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది. క్రీస్తు పుట్టుక విశేషాలను వివరిస్తూ రూపొందించిన పశువుల పాక, దేవదూతలు, గొర్రె పిల్లలు, ఏసేబు మరియమ్మ, బాల క్రీస్తు బొమ్మల కొలువు భక్తి భావాన్ని నింపుతోంది. పట్టణ శివారులోని 65 వ నెంబర్ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మించిన కల్వరి ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఇదీ చదవండి:వధువు వద్దంది.. పెళ్లికొచ్చిన అమ్మాయే పెళ్లికూతురైంది

ABOUT THE AUTHOR

...view details