కరోనాకు కట్టడి కోసం రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన హోమియో మందులను నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని కంగ్టి, నారాయణఖేడ్, పెద్ద శంకరంపేట, కల్హేర్ తదితర మండలాల్లో వారు పర్యటించారు.
హోమియో మందులను పంపిణీ చేసిన జహీరాబాద్ ఎంపీ - కొవిడ్-19 వార్తలు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ హోమియో మందులను పంపిణీ చేశారు. కరోనా కట్టడి కోసం రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ హోమియో మందులు ఉపయోగపడతాయన్నారు.
హోమియో మందులను పంపిణీ చేసిన జహీరాబాద్ ఎంపీ
అనంతరం ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వారితో పాటుగా ఆత్మ కమిటీ ఛైర్మన్ రాంసింగ్, కల్హేర్ జడ్పీటీసీ నర్సింహా రెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జోరు తగ్గిన కుర్బానీ.. బక్రీద్‌పై కొవిడ్ ప్రభావం