' ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్య చేసుకుంటా' - suicide attempt near by sangareddy dipo
ప్రశాంతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెవద్దకు ఓ గుర్తు తెలియని యువకుడు డీజిల్ బాటిల్తో వచ్చి కలకలం రేపిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది.
![' ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్య చేసుకుంటా'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4876101-106-4876101-1572086340866.jpg)
ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్య చేసుకుంటా
సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని యువకుడు డీజిల్ బాటిల్తో సమ్మె వద్దకు వచ్చి... కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు, ఆర్టీసీ కార్మికులు అడ్డుకొని యువకునికి సర్ది చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని కార్మికులు విన్నవించినా యువకుడు వినకపోవడంతో పోలీసులు అతన్ని స్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్య చేసుకుంటా