తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇస్నాపూర్​లో యువతి అదృశ్యం - Young women missing

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​లో ఓ యువతి నానమ్మ ఇంటి వద్ద నుంచి తల్లి వద్దకు వెళ్తూ అదృశ్యమైంది. పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Young woman disappears in Isnapur Village in Sangareddy district
ఇస్నాపూర్​లో యువతి అదృశ్యం

By

Published : Oct 25, 2020, 11:00 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్​లో బిహార్​కు చెందిన సోనీకుమారి అనే యువతి అదృశ్యమైంది. ఈనెల 16వ తేదీన నానమ్మ ఇంటి నుంచి తల్లి వద్దకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన ఆ యువతి మధ్యలోనే మాయమైంది.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కంగారుపడి చుట్టుపక్కల, తెలిసినా వారి ఇళ్ల వద్ద వెతికినా లాభం లేకుండా పోయింది. ఆచూకీ లభించకపోవడం వల్ల బాధిత కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:ఇద్దరు పిల్లలతో సహా... తల్లి అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details