తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరివేసుకొని యువతి ఆత్మహత్య - సంగారెడ్డిలో నేరవార్తలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Young Girl Hanging suicide in Sangareddy district
ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

By

Published : May 28, 2020, 10:17 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వీరభద్రనగర్ కాలనీలో ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు వెళ్లి చూసేసరికే ఆమె ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details