తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండోవిడత గొర్రెల పంపిణీ చేయాలి: యాదవ సంఘం - సంగారెడ్డిలో యాదవసంఘం రాస్తారోకో

రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్​ చేస్తూ యాదవ సంఘం నాయకులు రాస్తారోకో చేపట్టారు. గొర్రెలమందతో హైదరాబాద్-ముంబయి రహదారిపై నిరసన చేశారు.

yadav sangh protest at mumbai hyderabad national highway in sangareddy district
రెండోవిడత గొర్రెల పంపిణీ చేయాలి: యాదవ సంఘం

By

Published : Oct 5, 2020, 7:37 PM IST

రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి కూడలిలో యాదవ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. గొర్రెల కోసం డీడీలు కట్టి ఏడాది దాటినా వితరణలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై గొర్రెలమందతో సంప్రదాయ నిరసన చేశారు.

సీఎం కేసీఆర్ స్పందించి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. యాదవ సంఘం నాయకుల రాస్తారోకోతో హైదరాబాద్-ముంబై మార్గంలో వాహన రాకపోకలు స్తంభించాయి. కోహీర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారి రాస్తారోకో విరమింపజేసి.. రాకపోకలను పునరుద్ధరించారు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details