తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి నియోజకవర్గంలో నాగ దేవతకు పూజలు - sangareddy district latest news

సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాగ దేవతలకు భక్తులు పూజలు చేశారు. పుట్టలో పాలు పోశారు. దూప దీప నైవేద్యాలు సమర్పించారు. కరోనా మహమ్మరిని తొందరగా మన నుంచి దూరం చేయాలని భక్తులు నాగదేవతను ప్రార్థించారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో నాగ దేవతకు పూజలు
సంగారెడ్డి నియోజకవర్గంలో నాగ దేవతకు పూజలు

By

Published : Jul 25, 2020, 6:00 PM IST

కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రజలను ఈ మహమ్మారి ఇళ్లకే పరిమితం చేసింది. కరోనా పోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించాలన్నా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నో పండుగలను ప్రజలు జరుపుకోలేకపోతున్నారు. అలానే శనివారం నాగ పంచమి సందర్భంగా భారీగా నాగ దేవాలయాలు కిటకిటలాడే సమయంలో కరోనా వల్ల సందడి లేకుండాపోయాయి.

సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాగ దేవతలకు భక్తులు పూజలు చేశారు. పుట్టలో పాలు పోశారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. కరోనా మహమ్మరిని తొందరగా మన నుంచి దూరం చేయాలని భక్తులు నాగదేవతను ప్రార్థించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ABOUT THE AUTHOR

...view details