సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మాచిరెడ్డి పల్లిలో మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్- జైవిక మిత్ర సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాచిరెడ్డి పల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం, క్రీడలు నిర్వహించారు.
కోహిర్లో ఘనంగా మహిళా దినోత్సవాలు - మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్- జైవిక మిత్ర సంస్థ
సంగారెడ్డిలోని మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్- జైవిక మిత్ర సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. వేడుకల సందర్భంగా మహిళలకు ఉచిత వైద్యశిబిరం, క్రీడలు నిర్వహించారు.
కోహిర్లో ఘనంగా మహిళా దినోత్సవాలు
క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజేతగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. గత ఏడాది కాలంగా సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, పాడి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న సంస్థ.. మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.