తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్త వండిపెట్టమన్నదని కోడలు ఆత్మహత్య - suicide news in sangareddy

భర్త తాపీమేస్త్రీ... అతని కింద పని చేసే కూలీలందరికీ భోజనం వండిపెట్టే బాధ్యత భార్యది. ఈ క్రమంలో అత్త వచ్చి... అందరితో కాదు... తనకు ప్రత్యేకంగా వండిపెట్టమని కోరింది. అంతే... ఆ కోడలి మనసు గాయపడి... ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది

women suicide for small issue in house
అత్త ప్రత్యేకంగా వండిపెట్టమన్నదని కోడలు ఆత్మహత్య

By

Published : May 11, 2020, 12:51 PM IST

చిన్న పాటి మనస్పర్ధతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం కంచర్లకు చెందిన శివాని(25)కి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన హనుమంతుతో 2014లో వివాహమైంది. బతుకుదెరువు కోసం వచ్చి కొద్దికాలంగా పటాన్‌చెరులోని గోకుల్‌నగర్‌లో నివాసముంటున్నారు.

హనుమంతు తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని కింద పని చేసే వారికీ శివాని నిత్యం భోజనం వండి పెట్టేది. దీనికి తోడు అత్త కూడా నెలరోజుల క్రితం వచ్చి ఇక్కడే ఉంటోంది. అందరితోపాటు కాకుండా తనకు ప్రత్యేకంగా వంట చేసి పెట్టాలని అత్త చెప్పగా.. శివానికి కోపం వచ్చింది.

పనికి వెళ్లిన హనుమంతు.. రాత్రి ఇంటికి వచ్చేసరికి పడకగదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శివాని కనిపించింది. వెంటనే పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. శివాని కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా.. లాక్‌డౌన్‌ వల్ల రాలకపోయారు. ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ABOUT THE AUTHOR

...view details