సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని స్థానిక ఒకటో వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో పీహెచ్‌సీ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం స్థానికురాలైన సాబేరాబేగం(55)కు ఏఎన్‌ఎం కవిత కొవిషీల్డ్ టీకా వేశారు. ఇంకా మరో 20 మందికి టీకా ఇచ్చారు. వీరందరితో గ్రూప్ ఫొటో తీయాలని వైద్య సిబ్బంది సూచించారు. సాబేరాబేగం వారిలో ముందు ఉండగా ఆమెకు ఏఎన్‌ఎం కవిత టీకా వేస్తున్నట్లు ఫోజు ఇచ్చి.. నిజంగానే టీకా వేసేశారు.
Corona Vaccine: ఫొటోకు ఫోజు ఇస్తూ.. ముందే టీకా వేసిన విషయాన్ని మరిచి.. - ఫోటోకు ఫోజు ఇస్తూ రెండు డోసులు ఓకేసారి
ఫొటోకు ఫోజు ఇస్తూ.. ముందే టీకా వేసిన విషయాన్ని మరిచి.. మహిళకు మరో డోసు వేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచేసుకుంది.
vaccine
వెంటనే వైద్య సిబ్బంది అప్రమత్తమై ఆమెను స్థానిక పీహెచ్‌సీలో చేర్చారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిణి గాయత్రీదేవిని స్పందిస్తూ..... ఒకేసారి రెండు డోసులు తీసుకున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాబేరాబేగం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:ఒకే వ్యక్తికి నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు