సమాజంలో 95 శాతం మహిళలు.. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారని సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. కలెక్టరేట్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. మానవ హక్కులు ఎంత ముఖ్యమో, మహిళా చట్టాలూ అంతే ముఖ్యమని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
'95 శాతం మహిళలు.. ఫిర్యాదు చేయడం లేదు'
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టరేట్లో.. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత హాజరయ్యారు.
'95 శాతం మహిళలు.. ఫిర్యాదు చేయడం లేదు'
ఫిర్యాదుల కోసం.. హెల్ప్ లైన్ నెంబరు 181ను సంప్రదించాలని ఆశాలత సూచించారు. సఖీ కేంద్రాల్లో కంప్లైంట్ చేస్తే.. 30 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఒక్క మహిళ ముందుకొచ్చినా సమాజంలో మార్పు వచ్చే అవకాశముందని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి:స్టేటస్‌లో ఫొటో కూడా పెట్టుకోని ఆమె... వందల మందికి సెల్ఫీలిస్తోంది..