తెలంగాణ

telangana

ETV Bharat / state

వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య - వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకొని అత్యహత్య చేసుకుంది. విషయం తెలిసిన వివాహిత తల్లిదండ్రులు భర్త, అత్త, మామ, ఆడపడుచులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

woman suicide
వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

By

Published : Jan 13, 2020, 3:19 PM IST

కర్నూల్ జిల్లాకు చెందిన శ్రీలతకు హైదరాబాద్​కు చెందిన రాజశేఖర్ రెడ్డితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో శ్రీలత తల్లిదండ్రులు రాజశేఖర్ రెడ్డికి 25 లక్షల కట్నం ముట్టజెప్పారు. రెండేళ్లపాటు సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా ఉద్యోగం చేసిన అతను.. ఉద్యోగం మానేసి సంగారెడ్డిలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. భర్త ఉద్యోగం మానేసినప్పటికీ... శ్రీలత ఏమీ అనకపోయేది. హాయిగా సాగుతున్న వీరి కాపురంలో... చెల్లి పెళ్లి చిచ్చురేపింది.

శ్రీలత చెల్లికి గత నెల 5న పెళ్లి జరిగింది. తల్లిదండ్రులు కట్నంగా 50 లక్షలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న రాజశేఖర్ కుటుంబ సభ్యులు... తమకూ అదనపు కట్నం కావాలని శ్రీలతని వేధించడం మొదలు పెట్టారు. శ్రీలత పుట్టింటి వారికి తెలపగా... రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటే 50 లక్షల కట్నం ఇస్తానని చెప్పింది. మీ చెల్లికి ఎంత ఇచ్చారో మాకూ అంతే కావాలంటూ రోజూ శ్రీలతని వేధించారు. తట్టుకోలేని శ్రీలత నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెసుకున్న శ్రీలత తల్లిదండ్రులు భర్త, అత్త, మామ, ఆడపడుచుల వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల సన్నద్ధతపై ఎస్‌ఈసీ సమీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details