Woman Gave Birth To Baby by side of National Highway: జాతీయ రహదారి పక్కనే ఓ మహిళ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వద్ద అశోక్‌నగర్ జాతీయ రహదారిపై జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ప్రాంతానికి చెందిన బబిత నిండు గర్భిణి. మధ్యాహ్నం నడుచుకుంటూ వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో రామచంద్రాపురం అశోక్‌నగర్ కూడలి వద్ద రోదిస్తూ రోడ్డుపైనే కూర్చుండిపోయింది.
రహదారి పక్కనే శిశువుకు జన్మనిచ్చిన మహిళ.. అట్టపెట్టెలు అడ్డుపెట్టిన స్థానికులు - Woman Gave Birth To Baby by side National Highway
Woman Gave Birth To Baby by side of National Highway: పాపం నిండు గర్భిణి.. త్వరలోనే డెలివరి.. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంది ఆమె. రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళుతుంది.. ఇంతలోనే ఉన్నట్టుండి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆనొప్పులు భరించలేక ఆమె జాతీయ రహదారి పక్కనే కూర్చుండి పోయింది.. స్థానికులు గమనించి ఇంకా ఈ భూమి మీద మానవత్వం ఉందని నిరూపించారు. ఆ తరవాత ఏం జరిగింది?
జాతీయ రహదారి పక్కనే శిశువు జన్మనిచ్చిన మహిళ
పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న ఆమెను గమనించిన స్థానికులు సమీపంలో ఉన్న దుకాణాల నుంచి అట్ట పెట్టెలను తెచ్చి అడ్డుగా పెట్టారు. కాసేపటికి ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఆమెను ఆటోలో పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె దయనీయ స్థితిని చూసి చలించిన ఓ వ్యక్తి కొంతమేర ఆర్థిక సాయం చేశారు. ఇది ఇలా ఉండగా ఆమె రహదారిపై ప్రసవించడంతో రహదారిపై వెళ్లేవారు వీడియోలు తీయడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఇవీ చదవండి: