సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారే తమ కూతురిని చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. జిల్లాలోని ఇస్నాపూర్ చెందిన మల్లికార్జునకు, ఘట్పల్లికి చెందిన సునీతకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో మూడు లక్షల నగదు, ద్విచక్ర వాహనం, మూడు తులాల బంగారం ముట్ట చెప్పారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ, ఆడపడుచులు సునీతను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసేవారని సునీత తల్లి పేర్కొంది.