సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధురలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు సహా దంపతులు మృతిచెందారు. కొన్యాలకు చెందిన పత్తి మల్లేషం, నర్సమ్మ భార్యభర్తలు. మధుర గ్రామశివారులోని మొక్కజొన్న పంటలోకి వెళ్లిన ఎద్దులను తీసుకొచ్చేందుకు వెళ్లారు. అప్పటికే పందుల నుంచి రక్షణ కోసం పంట పొలం చుట్టూ వేసిన విద్యుత్ కంచెకు రెండు ఎద్దులు బలయ్యాయి. దాన్ని చూసిన మల్లేషం.. వెంటనే పొలంలోకి వెళ్లేందుకు యత్నించగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. భర్తను కాపాడే యత్నంలో నర్సమ్మ సైతం ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ జయరాం ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దంపతులను బలితీసుకున్న పొలం విద్యుత్ కంచె
సంగారెడ్డి జిల్లా మధుర గ్రామంలో పంట పొలంలో వేసిన విద్యుత్ కంచె.. కాడెద్దులు సహా దంపతుల మరణానికి కారణమైంది. సమాచారం అందుకున్న తాహసీల్దార్ విచారణ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
దంపతులను బలితీసుకున్న పొలం విద్యుత్ కంచె