సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్, నాద్లాపూర్, పోతిరెడ్డిపల్లి, తడ్మానూర్ గ్రామాల్లో రాత్రి గాలి వాన, వడగళ్లు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షం రైతులను హడలెత్తించింది. వేగంగా వీచిన గాలికితోడు వడగళ్లవాన కురవడం వల్ల 50 ఎకరాల్లో వరి, జొన్న, మామిడి తోటలు 50 శాతం మేర దెబ్బతిన్నాయి. డాకూర్ గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న కోళ్లఫాం పూర్తిగా నేలమట్టమయ్యింది.
గాలి వాన బీభత్సం.. 50 ఎకరాల్లో పంట నష్టం - wind rain at sangareddy
ఆందోల్ మండలంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి వచ్చిన గాలి వాన బీభత్సం సృష్టించింది. కోడెకల్ గ్రామంలో వైకుంఠదామం షేడ్ పై కప్పు రేకులు పూర్తిగా లేచిపోయాయి. 15 స్తంభాలు నేలకొరిగాయి. సుమారు 50 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
గాలి వాన బీభత్సం.. 50 ఎకరాల్లో పంట నష్టం
కోడెకల్ గ్రామంలో వైకుంఠదామం షేడ్ పైకప్పు రేకులు పూర్తిగా లేచిపోయాయి. 15 స్తంభాలు నేలకొరిగాయి. 10ఎకరాల్లో సాగు చేసిన పుచ్చకాయ, కర్బూజ పంట పూర్తిగా దెబ్బతింది.
ఇదీ చూడండి :అమృత వల్లే ఈ దారుణాలన్నీ: మారుతీరావు తమ్ముడు శ్రవణ్