విధి నిర్వహణలో పనిభారం తగ్గించాలంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి స్రవంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన చేపట్టారు. సమస్యలపై వినతిపత్రం అందించారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో రేయింబవళ్లు కష్టపడి పని చేసేందుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. అధికారులు తమపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి పనిభారం మోపడం సరికాదని ఉద్యోగ సంఘం నాయకులు వాపోయారు. ప్రభుత్వం తమను మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
'పని చేస్తాం కానీ..అధిక పనిభారం వద్దు' - విధి నిర్వహణలో పనిభారం తగ్గించాలంటూ
మేము మనుషులమే..మాకు పరిమితికి మించి విధులు కేటాయించడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు. సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఉద్యోగులపై అధిక పనిభారం మోపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
అధిక పనిభారం మోపడంపై పంచాయతీ ఉద్యోగుల ఆందోళన