సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధి ప్రకృతి నివాస్‌లో భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను చంపాలని చూస్తున్నాడని అత్తింటి ముందే కోడలు ధర్నాకు దిగింది. తన భర్త రామకృష్ణ... కొంత కాలంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అత్తింటి ముందు స్వప్న నిరసన చేపట్టింది.
'భర్త చంపాలని చూస్తున్నాడు.. అత్తింటి ముందు కోడలి ధర్నా' - Sangareddy district news
తనను భర్త చంపాలని చూస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ అత్తింటి ముందు ఆందోళనకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లా అన్నారంలో చోటుచేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని వాపోయింది.
!['భర్త చంపాలని చూస్తున్నాడు.. అత్తింటి ముందు కోడలి ధర్నా' 'భర్త చంపాలని చూస్తున్నాడు.. అత్తింటి ముందు కోడలి ధర్నా'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10147676-1037-10147676-1609990151491.jpg)
'భర్త చంపాలని చూస్తున్నాడు.. అత్తింటి ముందు కోడలి ధర్నా'
భర్త వేరే మహిళతో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని.. అప్పటి నుంచి తనను చంపాలని చూస్తున్నాడని స్వప్న ఆరోపించింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంది. ప్రాణహాని ఉందని అత్తమామలకు చెప్పిన పట్టించుకోవడం లేదని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:'ఆ భూములు మా నాన్న కొన్నవి.. ఇవ్వాల్సిందే'