తెలంగాణ

telangana

ETV Bharat / state

బోరు నుంచి జలం పొంగింది... జలసిరులతో గ్రామం తడిసింది - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

వందల అడుగులు తవ్వినా కనిపించిన నీటి జాడలు గురించి మనకు తెలిసిందే. ఎక్కడైనా ఓ నాలుగైదొందల అడుగులు లోపు నీరు పడిందంటే వాడు అదృష్ట వంతుడురా అనుకుంటాం... అలాంటిది 360 అడుగులు బోరు తవ్వుతుండగా నీళ్లు ఉప్పొంగి రావడం వల్ల గ్రామస్థులు నీటి సిరులతో తడిసి ముద్దయ్యారు.

Water rising from the bore at zaherabad mandal
బోరు నుంచి జలం పొంగింది

By

Published : Mar 1, 2020, 4:32 PM IST

భూగర్భజలాలు అడుగంటిన వేళ గ్రామ తాగునీటి అవసరాల కోసం తవ్విన బోరు బావినుంచి జలం ఉప్పొంగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్​లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తడం వల్ల పంచాయతీ నిధులతో చోటే పీర్ దర్గా పరిసరాల్లో శుక్రవారం రాత్రి బోరుబావి తవ్వించారు. 360 అడుగులు లోతుకు వెళ్లగానే ఒక్కసారిగా నీళ్లు ఉబికి వచ్చాయి.

ఐదు నుంచి ఆరు ఇంచుల మేర నీళ్లు పడడం వల్ల గ్రామస్థులకు తాగు నీటి అవసరాలకు ఢోకా లేదని స్థానికులు సంబరపడుతున్నారు. బోరుబావుల తవ్వకంపై ప్రభుత్వం నిషేధం విధించిన స్థానికుల విజ్ఞప్తుల మేరకు సర్పంచి ప్రత్యేక చొరవ చూపి బోరు వేయగా పుష్కలంగా నీళ్లు పడడం వల్ల గ్రామస్థులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

బోరు నుంచి జలం పొంగింది

ఇవీ చూడండి:అక్రమ వసూళ్లు.. అవినీతి 'రహదారి'..!

ABOUT THE AUTHOR

...view details