సంగారెడ్డి జిల్లా కంగ్టిలోని పలు ఇళ్లలో గల బోరు బావుల నుంచి నీరు వాటంతట అవే ఉబికి వస్తున్నాయి. కంగ్టిలో దారం రమేష్, దారం రాములు ఇళ్లు పక్కపక్కన ఉన్నాయి. గడిచిన రెండురోజులుగా కుండపోత వర్షంతో కంగ్టిలో వీధుల గుండా వరద నీరు పారుతోంది.
బోరుబావుల నుంచి ఉబికివస్తున్న గంగమ్మ - ground water levels increasing in telangana
ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో రెండు బోరు బావుల నుంచి నీరు దానంతట అదే ఉబికి వస్తోంది. ఈ దృశ్యాలు చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.
బోరుబావుల నుంచి ఉబికివస్తున్న గంగమ్మ
లోతట్టు ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఇళ్లలో ఉన్న బోరు బావుల్లో నీరు అమాంతం ఉబికి వస్తోంది. ఈ దృశ్యాలు చూసేందుకు స్థానికులు బారులు కట్టారు. తాము ఇళ్లు నిర్మించిన నాటి నుంచి ఇలా వాటంతట అవే నీరు రావడం ఇదే మొదటిసారని ఇంటి యజమానులు తెలిపారు.
ఇవీ చూడండి: భారీగా చేరిన వరద నీరు.. నిండి పారుతున్న కోయిల్ సాగర్!