తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న జహీరాబాద్​

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. పట్టణవ్యాప్తంగా ఉన్న కాలనీలు నీట మునగగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీరు నిండగా రెండు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.

water filled in zaheerabad city due to heavy rains
భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న జహీరాబాద్​

By

Published : Oct 14, 2020, 12:41 PM IST

మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కుండపోతగా కురిసిన వర్షంతో లోతట్టు కాలనీలు చెరువులను తలపించాయి. జహీరాబాద్​ 65వ జాతీయ రహదారి బైపాస్​ రోడ్డుపై వరద నీరు చేరగా హైదరాబాద్- ముంబై మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.

జహీరాబాద్​ పట్టణ శివారులోని వసంత్​ విహార్​, ఇంద్రప్రస్థ కాలనీ, డ్రీం ఇండియా కాలనీ, మూసానగర్​, నేతాజీనగర్​ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరి వరద చుట్టుముట్టింది. రహదారులపైకి నీరు వచ్చేయగా.. పోలీసుల పర్యవేక్షణలో వాహన రాకపోకలు సాగిస్తున్నారు.

ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయంలోకి వరద నీరు చేరి గర్భగుడి మునిగిపోయింది. కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీరు నిండగా రెండు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల వరద ఉద్ధృతిని జహీరాబాద్​ ఆర్డీవో రమేష్​ బాబు, శంకర్​రాజు పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details