తెలంగాణ

telangana

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

యూట్యూబ్ ఉంటే చాలు... ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌ను చూస్తున్నారు. సంగారెడ్డిలో యూట్యూబ్ చూసి ఇద్దరు యువకులు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు.

By

Published : Nov 23, 2019, 10:28 PM IST

Published : Nov 23, 2019, 10:28 PM IST

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 43తులాల బంగారం, లక్ష నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. గత మూడు నెలల నుంచి వివేక్, గోపాల్ రెడ్డి అనే ఇద్దరు యువకులు 17 దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు.

వీరిద్దరూ సంగారెడ్డి జిల్లా కల్హేర్​కు చెందిన వారని తెలిపారు. యూట్యూబ్​లో ఇళ్ల తాళాలు ఎలా పగులగొట్టాలనేది శోధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఇద్దరూ 17 దొంగతనాలు చేసినటప్పటికీ.. ఇప్పుడే మొదటిసారి పోలీసులకి పట్టుబడినట్లు స్పష్టం చేశారు. దొంగలను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులను అభినందించారు.

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details