ఓటర్ల జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల నమోదుకై రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఓటర్ల జాబితా సవరణల కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, సవరణల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన యాప్‌ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలు తమ తమ ఇండ్లకు వచ్చే బీఎల్వోలకు సహకరించి, ఓటర్ లిస్టు సరి చేసుకోవాలని సూచించారు.
సంగారెడ్డిలో ఓటరు అవగాహన కార్యక్రమం - Sangareddy
సంగారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో సవరణల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన యాప్‌ని ఆయన ఆవిష్కరించారు.
సంగారెడ్డిలో ఓటరు అవగాహన కార్యక్రమం