సంగారెడ్డి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు 'ప్రజాస్వామ్య బలోపేతం- యువత పాత్ర' అనే అంశంపై 'ఈటీవీ భారత్- ఈనాడు' అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని... అభిప్రాయం వెల్లడించారు. ప్రలోభాలకు లొంగకుండా... సరైన నాయకుడిని ఎన్నుకోవాలని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు నీతి నిజాయితీతో గ్రామాభివృద్ధికి కృషి చేసేలా ఉండాలని విద్యార్థులు అన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు, మద్యం పంపిణీ చేసే వారికి.. ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. ఒకసారి ఇచ్చే డబ్బులకు ఐదు సంవత్సరాల కాలాన్ని అమ్ముకోవద్దని కోరారు. డబ్బులు తీసుకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామన్నారు.