కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున దుకాణాల సమయం తగ్గించాలని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వర్తక సంఘం వ్యాపారులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 60 మంది మహమ్మారి బారిన పడటం వల్ల సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు.
దుకాణాల సమయం తగ్గించేందుకు స్వచ్ఛంద తీర్మానం - పటాన్ చెరులో దుకాణాల సమయం తగ్గించేలా స్వచ్ఛంద తీర్మానం
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున దుకాణాలు తెరిచే సమయం తగ్గించాలని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వర్తక సంఘం సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 60 కరోనా కేసులు నమోదు కావడం వల్ల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

దుకాణాల సమయం తగ్గించేలా స్వచ్ఛంద తీర్మానం
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరవాలని నిర్ణయించారు. అలాగే బొల్లారం మున్సిపల్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరిచి ఉంచుతామని వర్తక సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఇవీ చూడండి:హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్