తాగునీరు సరఫరా చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పస్తాపూర్‌లో గ్రామస్థులు ఖాళీ డ్రమ్ములు, బిందెలతో రాస్తారోకో చేశారు. గత రెండు రోజులుగా నీటి సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీటి కోసం గ్రామస్థుల రాస్తారోకో - sangareddy district news
తాగునీరు లేక అల్లాడుతున్నామని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లో గ్రామస్థులు రాస్తారోకో చేశారు. జహీరాబాద్-కప్పాడ్ రహదారిపై డ్రమ్ములు, బిందెలు పేర్చి ఆందోళన చేపట్టారు.
![తాగునీటి కోసం గ్రామస్థుల రాస్తారోకో villagers protest for drinking water in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7357219-168-7357219-1590502116425.jpg)
తాగునీటి కోసం గ్రామస్థుల రాస్తారోకో
జహీరాబాద్- కప్పాడ్ రహదారిపై డ్రమ్ములు, బిందెలు పేర్చి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు చేరుకుని నీటి సరఫరాలో ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చి రాస్తారోకో విరమింపజేశారు.
ఇవీ చూడండి: విద్యుత్ స్తంభం ఎక్కిన ఐదేళ్ల బుడతడు.. కారణమిదే!