తెలంగాణ

telangana

By

Published : Aug 21, 2019, 4:02 PM IST

ETV Bharat / state

డంపింగ్‌ యార్డు తొలగించాలంటూ గ్రామస్థుల ఆందోళన

సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌లో  డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డు వల్ల ఈగలు, దోమలు, కుక్కల బెడద ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు.

డంపింగ్‌ యార్డు తొలగించాలంటూ గ్రామస్థుల ఆందోళన

తమ గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌కు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం పూట చెత్త వేయడానికి వచ్చిన ట్రాక్టర్లను అడ్డుకొని వెనక్కి పంపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ గ్రామ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల గ్రామస్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఈగలు, దోమలు, కుక్కల బెడద ఎక్కువ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించి పరిష్కారం చూపించాలని కోరారు.

డంపింగ్‌ యార్డు తొలగించాలంటూ గ్రామస్థుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details