ప్రస్తుతఎన్నికలు రాహుల్ గాంధీ, మోదీ మధ్యే జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షురాలు విజయశాంతి స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజవర్గ కార్యకర్తల సమావేశంలో తెరాస పాలనపై విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని.. ప్రజా సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. తెరాస నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. న్యాయం ఎప్పుడు శాశ్వతమని.. అన్యాయం ఎప్పుడూ తాత్కాలికమేనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఓటు వేసి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేద్దామని కార్యకర్తలకు సూచించారు.
'తెరాస పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు' - congress
నాలుగున్నరేళ్ల తెరాస పాలనపై కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షురాలు విజయశాంతి విరుచుకుపడ్డారు. తెరాస నియతృత్వ ధోరణితో ముందుకెళ్తోందని.. ప్రజాసంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
తెరాసపై విజయశాంతి ధ్వజం