రోజురోజుకు కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నందున కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలకు బంద్ ప్రకటిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున లాభం కన్నా ప్రాణం మిన్న అనే ఉద్దేశంతో వ్యాపారులు తమ సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.
సదాశివపేటలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థల బంద్ - sangareddy district corona updates
కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్నందున కొందరు వ్యాపారులు లాభం కన్నా ప్రాణం మిన్న అనే నినాదాన్ని ఒంట బట్టించుకున్నారు. వ్యాపార సంస్థలకు స్వచ్ఛందంగా బంద్ ప్రకటిస్తూ వైరస్ వ్యాపించకుండా తమవంతు కృషి చేస్తున్నారు.
సదాశివపేటలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థల బంద్
నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు తమ దుకాణాలు మూసివేసే ఉంచుతామని వ్యాపారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, స్వీయజాగ్రత్తలు పాటిస్తూ కరోనా మహమ్మారిని తరివివేయాలని కోరారు.