కన్నీటి పాలు: వర్షానికి కూరగాయల తోటలు ధ్వంసం - మారేపల్లిలో కూరగాయల తోటలు ధ్వంసం
ఇటీవల కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో... రైతు సాగు చేసిన కాలీఫ్లవర్, టమాటా తోట ధ్వంసమైంది. పంట నష్టపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కన్నీటి పాలు: వర్షానికి కూరగాయల తోటలు ధ్వంసం
వారం రోజుల నుంచి నిన్నటిదాకా కురిసిన ఎడతెరపి లేని వర్షాలు పంటల నష్టాలకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో కాలీఫ్లవర్, టమాటా తోట ధ్వంసమయ్యాయి. గ్రామానికి చెందిన మానిక్ రెడ్డి అనే రైతు కూరగాయలు సాగు చేయగా... వర్షం నీటిలో మునిగి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆదుకుంటుందని ఆశలు పెట్టుకున్న పంట నీటిపాలైందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.