వర్షాభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగ మహోత్సవం జరుగుతోంది. జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్ర, శని, ఆదివారాల పాటు యాబై మంది రుత్విక్కులతో యాగం నిర్వహిస్తున్నారు. శాస్త్రోక్తంగా మంత్రాలు పటిస్తూ ఐదుగురు రుత్వికులను భారీ పాత్రల్లో నీళ్లలో కూర్చుని మంత్రాలు పాటించారు.
సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగ మహోత్సవం - undefined
వర్షాలు సమృద్ధిగా కురవాలని సంగారెడ్డి జిల్లాలోని రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు యాభై మంది రుత్విక్కులతో సాగుతున్న ఈ యాగం ఆదివారం ముగియనుంది.
సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగ మహోత్సవం
కార్యక్రమంలో మొదటి రోజు దీప ప్రజ్వలన, శాంతి పాఠము, గోపూజ, పుణ్య వచనము, ఆచార్య రితిక వరణము, ముఖ్య దేవత స్థాపన, వరుణ జప హోమాలు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ సముద్రాల వేణుగోపాలచారి హాజరై దర్శించుకున్నారు. అనంతరం సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీస్సులు అందుకున్నారు.
ఇవీ చూడండి: పంచాయతీ రాజ్ చట్టంపై కేసీఆర్ దిశానిర్దేశం