తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలనీలో కలకలం.. రాత్రిపూట ఆడవాళ్ల బట్టలు బయట కనిపిస్తే ఖతమే..! - పటాన్​చెరు వార్తలు

ladies clothes tearing: ఆ ప్రాంతంలో గత కొంత కాలంగా బయట ఆరేసిన బట్టలు చిరిపోయి ఉంటున్నాయి. అందులోనూ.. కేవలం ఆడవాళ్ల బట్టలే చిరిగిపోతున్నాయి. పక్కనున్న మగవాళ్ల దుస్తులు మాత్రం.. చిన్న చిల్లు కూడా పడకుండా.. ఎలా ఉన్నాయో అలాగే ఉంటున్నాయి. ఇలా.. ఒక్కరిద్దరి ఇంట్లో కాదు.. ఆ కాలనీలోని చాలా ఇళ్లలో ఇదే తంతు. మరి బట్టలు చింపేస్తోంది ఎవరు..?

unkonwn person tearing ladies clothes in night time at patancheru
unkonwn person tearing ladies clothes in night time at patancheru

By

Published : Mar 11, 2022, 5:28 PM IST

రాత్రిపూట ఆడవాళ్ల బట్టలు బయట కనిపిస్తే ఖతమే

Ladies clothes tearing: ఒకరిపై కోపమో.. ద్వేషమో.. పగో.. ఉంటే.. ఒక్కొక్కరు ఒక్కోలా తీర్చుకుంటారు. ఇందుకోసం కొంత మంది కొట్టటమో.. గొడవ పెట్టుకోవటమో.. చేస్తే, మరికొందరు మాత్రం వాళ్లకు చెందిన ఆస్తులో.. వస్తువులో ధ్వంసం చేసి అందులో సంతృప్తి వెతుక్కుంటుంటారు. మరి ఈ అపరిచిత వ్యక్తికి కోపం ఉందో.. ద్వేషం ఉందో.. మతిభ్రమించి చేస్తున్నాడో కానీ.. ఆ కాలనీలో ఉన్న ఆడవాళ్లందరి దుస్తులన్నీ చింపేస్తున్నాడు.

అసలు విషయమేంటంటే..

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జేపీ కాలనీలో రాత్రిపూట బయట ఆరేసిన దుస్తుల్లో మహిళల దుస్తులు చినిగిపోయి ఉంటున్నాయి. ఒకరిద్దరికి అయితే చూసిచూడనట్టు వదిలేవాళ్లే.. కానీ.. ఈ ఘటన చాలాసార్లు జరగడంతో కాలనీవాసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. తెల్లవారుజాము సమయంలో ఓ అపరిచిత వ్యక్తి బయట సంచరిస్తూ.. మహిళల దుస్తులు కనబడితే చాలు.. వాటిని చింపేసి మళ్లీ అక్కడే పెట్టి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి. విచిత్రమేమిటంటే.. ఆడవాళ్ల దుస్తుల పక్కనే పురుషుల బట్టలు ఉన్నా కూడా.. ఆ అపరిచిత వ్యక్తి ముట్టుకోవడం లేదు.

ఇదే తరహా ఘటనలు జేపీకాలనీలో జనవరిలో కూడా జరిగాయి. మళ్లీ ఈ రెండు రోజుల నుంచి మహిళల దుస్తులు చిరిగిపోయి ఉంటుండడంతో.. ఈ విషయం వెలుగుచూసింది. దీంతో కాలనీవాసులు అప్రమత్తమయ్యారు. రాత్రి సమయంలో తమ బట్టలు బయట వదలేయకుండా మహిళలు జాగ్రత్త పడుతున్నారు. ఆ అపరిచిత వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు కాలనీవాసులు ప్రయత్నిస్తున్నారు.

అతడి మోటో ఏంటో..

కోపం ఉంటే.. ఒకరిద్దరి బట్టలు చింపేశాడనుకోవచ్చు. మరి కాలనీలో కనిపించిన ఆడవాళ్ల బట్టలన్ని చింపేస్తున్నాడంటే.. వాళ్లందరి మీద ద్వేషం పెట్టుకున్నాడంటారా..? అలా కాకుండా మతిభ్రమించిందేమో అనుకుందామనుకున్నా.. కేవలం ఆడవాళ్లవే చింపేస్తున్నాడు. పురుషులవి ముట్టుకోవట్లేదంటే.. ఏమనుకోవాలి..? ఆ అపరిచితుని మోటో ఏంటో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details