తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐక్యంగా ఉంటేనే పల్లెప్రగతి సాధ్యం: ఐజీ నాగిరెడ్డి - latest news on ig nagireddy

గ్రామస్థులు ఐక్యంగా ముందుకు సాగితేనే పల్లెప్రగతి సాధ్యమని ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అంతారంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Unity is possible only if united: IG Nagireddy
ఐక్యంగా ఉంటేనే పల్లెప్రగతి సాధ్యం: ఐజీ నాగిరెడ్డి

By

Published : Jan 3, 2020, 9:30 AM IST

ప్రభుత్వం అందిస్తున్న నిధుల తోడ్పాటుతో గ్రామస్థులు ఐక్యంగా ముందుకు సాగితేనే పల్లె ప్రగతి సాధ్యమని ఐజీ మల్లారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని జీవన్ముక్త పాండురంగ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామస్థులు సమష్టిగా ముందుకు సాగితేనే పల్లెప్రగతి సాధ్యమని ఐజీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శ్రమదానంలో పాల్గొనాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠ్యాంశాల బోధన, మౌలిక వసతులపై విద్యార్థులతో మాట్లాడారు. రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు.

ఐక్యంగా ఉంటేనే పల్లెప్రగతి సాధ్యం: ఐజీ నాగిరెడ్డి

ఇవీ చూడండి: ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు పూర్తి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details