కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను చేపట్టి కార్మిక హక్కులను తుంగలో తొక్కుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... సీఐటీయూ, ఐఎన్టీయూ, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, వివిధ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో... సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేప్టటారు. కలెక్టరేట్ ఆవరణమంతా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగింది. నల్ల బ్యాడ్జిలు ధరించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
'ప్రభుత్వాలు కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నాయి' - sangareddy latest news
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
ప్రభుత్వాలు కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నాయి
ప్రజలు, కార్మికుల విధి విధానాలకు భంగం కలిగిస్తే కార్మిక సంఘాలు ఊరుకోవని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:గాయత్రి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం