తెలంగాణ

telangana

ETV Bharat / state

రియాక్టర్‌ పేలి ఇద్దరు కార్మికులు మృతి - నందికంది రసాయన పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లా నందికంది పరిధిలోని ఓ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మరణించారు. వారిలో ఒకరు వరంగల్‌ జిల్లాకు చెందగా.. మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రియాక్టర్‌ పేలి ఇద్దరు కార్మికులు మృతి
రియాక్టర్‌ పేలి ఇద్దరు కార్మికులు మృతి

By

Published : Sep 19, 2020, 10:58 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది పరిధిలోని గాయత్రి స్టార్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మరణించారు. ఒకరు వరంగల్ జిల్లా వాసి అరవింద్కాగా.. మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్వరాజ్‌లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details