ప్రపంచమంతటిది ఒక సమస్యైతే.. కల్లు, మద్యం బానిసలది మరో సమస్య. వింత ప్రవర్తన, ఆత్మహత్య యత్నం, ఆత్మహత్యలతో అధికారులకు చుక్కలు చూపిస్తోన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామస్థుడు భవాని కృష్ణకు కల్తీకల్లుకు బానిసయ్యాడు. లాక్డౌన్ కారణంగా కల్లు, మద్యం లభించకపోయే సరికి కొద్ది రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ నెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భవాని కృష్ణ తిరిగి రాలేదు. ఆచూకి లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కనిపించకుండా పోయిన కల్తీకల్లు బానిసలు - lockdown news
కల్లు,మద్యం దుకాణాలు మూసి వేత కొంత మందిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మద్యానికి బానిసలైన వారి ప్రవర్తనతో కుటుంబ సభ్యులతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడుతోంది.
![కనిపించకుండా పోయిన కల్తీకల్లు బానిసలు కనిపించకుండాపోయిన కల్లు బానిసలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6605925-thumbnail-3x2-kal.jpg)
కనిపించకుండాపోయిన కల్లు బానిసలు
ఇస్నాపూర్లో ఉంటూ కల్లుకు బానిసైన సత్తయ్య కూడా నిన్న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పటాన్చెరు పోలీసులకు సమాచారమివ్వగా కేసు నమోదు చేసుకున్నారు. ఇరువురి కోసం గాలిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు.