తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకటే ఇల్లు... రెండు విషాదాలు.. - పోలీస్​

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుమారుని అంత్యక్రియల అనంతరం  చెరువులో స్నానానికని దిగిన తండ్రి గల్లంతయ్యారు. బంధువులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎంత గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు.

చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతు

By

Published : Feb 14, 2019, 11:20 AM IST

చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతు
కుమారుని అంత్యక్రియల తర్వాత చెరువులో స్నానం చేస్తూ తండ్రి గల్లంతైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పట్టణానికి చెందిన మహేశ్​ సోమవారం అకస్మాత్తుగా మరణించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం తండ్రి కృష్ణ పట్టణ శివారులోని మహబూబ్​సాగర్​ చెరువులో స్నానం చేస్తూ గల్లంతయ్యారు. అప్రమత్తమైన బంధువులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం సాయంత్రం వరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలించిన ఫలితం లేకపోయింది.



ABOUT THE AUTHOR

...view details