తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ నిబంధనలు బేఖాతరు... దుకాణాలు సీజ్ - మొబైల్​ దుకాణాలు సీజ్ చేసిన ఆంధోల్ జోగిపేట్​ మున్సిపల్ అధికారులు

కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. సంగారెడ్డి జిల్లా అందోల్​ జోగిపేట్​ పురపాలికలో మాస్కులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న రెండు మొబైల్​ దుకాణాలు సీజ్​ చేశారు.

two mobile shops seized by municipal officers do not follow the covid instructions
ఆంధోల్ జోగిపేట్​లో మొబైల్​ దుకాణాలు సీజ్​ చేస్తున్న పురపాలిక అధికారులు

By

Published : Apr 13, 2021, 11:38 AM IST

మాస్కులు ధరించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న రెండు మొబైల్​ దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్​​ జోగిపేట్​ మున్సిపాలిటీలో కొవిడ్​ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. జరిమానాతో పాటు కేసులు నమోదు చేశారు.

పురపాలికలోని వ్యాపార సముదాయాలపై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. మొబైల్ దుకాణ యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతే కాకుండా మాస్కులు పెట్టుకోమంటూ పురపాలక అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానాతో పాటు దుకాణాన్ని సీజ్ చేసినట్లు పురపాలక శానిటేషన్ ఇన్​స్పెక్టర్​ వినయ్ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి:లాటరీలో కారు గెలుచుకున్నారంటూ... ఐదు లక్షలు కాజేశారు

ABOUT THE AUTHOR

...view details