సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడిగిలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగులు పడ్డాయి. గ్రామ శివారులో పొలం వద్ద కొట్టంలో కట్టేసిన ఎద్దులపై పిడుగు పడటం వల్ల రైతు నర్సింహులుకు చెందిన రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి.
పిడుగు పడి రెండు ఎద్దులు మృతి - two bulls died
గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం కారణంగా పిడుగు పడి రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా డిడిగిలో చోటుచేసుకుంది.
పిడుగు పడి రెండు ఎద్దులు మృతి
లక్షన్నర రూపాయల విలువైన ఎద్దులు మృత్యువాత పడడం వల్ల నష్టపోయానని నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ఇవీ చూడండి: రుతుపవనాలు ఈసారి 4 రోజులు ఆలస్యం