సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామంలో పిడుగు పాటుతో రెండు ఎద్దులు మృతి చెందాయి. చేర్యాల గ్రామానికి చెందిన గుంతపల్లి అంతయ్యకు చెందిన రెండు ఎద్దులు మేత మేస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడడం వల్ల అవి మృత్యువాత పడ్డాయి.
పిడుగు పడి రెండు ఎద్దులు మృతి - sangareddy district news
పిడుగు పడి రెండు ఎద్దులు మృత్యువాత పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా చేర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతు వేడుకున్నాడు.
పిడుగు పడి రెండు ఎద్దులు మృతి
తమకు ఎంతగానో సేవలందించిన ఎద్దులు మరణించడం వల్ల రైతు బోరున విలపించాడు. ఎద్దులతోనే పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని... ప్రభుత్వం ఆర్థికసాయం చేసి తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.
ఇవీ చూడండి: గుండెపోటుతో అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ మృతి