సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి వైపు నుంచి పటాన్ చెరు వస్తున్న ద్విచక్ర వాహన చోదకుడు అతివేగంగా వచ్చి వెనుకనుంచి మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీనివల్ల అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరి మృతి - రెండు ద్విచక్రవాహనాలు ఢీ
అతివేగంగా ద్విచక్రవాహనాన్ని నడుపుతూ చోదకుడు వెనుకనుంచి మరోద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడం వల్ల అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరి మృతి
మెరుగైన చికిత్స కోసం నలగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని కుమారుడు వెంకట శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.