క్షయ వ్యాధిని 2025 నాటికి పూర్తిగా నశింపజేసే విధంగా భారత ప్రభుత్వం ముందుకు సాగుతోందని సంగారెడ్డి జిల్లా క్షయ వ్యాధి అధికారి రాజేశ్వరి పేర్కొన్నారు. జిల్లాలో ఆరు టీబీ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు.
తెమడ పరీక్షకు జిల్లాలో 30 మైక్రోస్కోపిక్ కేంద్రాలు గుర్తించామని వెల్లడించారు. ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని వ్యాధిని అంతం చేయాలన్నారు.