ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ మార్కెట్ వద్ద తెదేపా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేశ్ ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆర్టీసీని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి.. కార్మికులపై కన్నెర్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి షరతులు లేకుండా చేరుతామని కార్మికులు చెబుతుంటే చేర్చుకునే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేయడం లేదని మండిపడ్డారు. కార్మికుల పట్ల వ్యతిరేకత భావన ఉన్న వ్యక్తిగా సీఎం చరిత్రలో నిలిచిపోతారన్నారు.
'కార్మిక వ్యతిరేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు' - ttdp latest updates
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ మార్కెట్ వద్ద నందమూరి తారకరామారావు విగ్రహాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ ఆవిష్కరించారు.
'కార్మిక వ్యతిరేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు