సంగారెడ్డి జిల్లాలో పాఠశాలలను తెరవాలా వద్దా... ఆన్లైన్ క్లాసుల వల్ల లాభ, నష్టాలేంటి... అనే విషయంపై టీఎస్‌యూటీఎఫ్ సర్వే నిర్వహించింది. ఆ ఫలితాలను జిల్లా ఉపాధ్యాయ అధికారి వెల్లడించారు. జిల్లాలోని విద్యార్థులను, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించామని తెలిపారు.
దాదాపు 91% మంది ఆఫ్‌లైన్ విద్యనే అందించాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యార్థులే కాకుండా ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ బోధన పట్ల విముఖత చూపించారు. కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి... వివిధ ప్రాంతాల్లో ఉన్నతమైన జాగ్రత్తలతో పాఠశాలలు తెరవాలని పేర్కొన్నట్లు వెల్లడించారు.