సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలుకుతూ పట్టణంలో బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ప్రదర్శన కొనసాగించారు. అనంతరం ప్రధాన గేటు ముందు బైఠాయించి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు మద్దతుగా నిలుస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.
కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకుల ర్యాలీ - సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.
కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకుల ర్యాలీ