సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. 38వ రోజు నిరసనలో భాగంగా జహీరాబాద్ బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగించారు. ఐకాస ముట్టడి పిలుపుతో పోలీసులు ముందస్తుగా క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు మూసివేసి కార్మికులను అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం - జహీరాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన ఆర్టీసీ కార్మికులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఎమ్మెల్యే మాణిక్ రావు అక్కడ లేకపోవడం వల్ల సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం
పోలీసులు అనుమతితో ఐదుగురు కార్మికులు కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాణిక్రావు కార్యాలయంలో లేకపోవడం వల్ల సిబ్బందికి వినతి పత్రం అందజేసినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు అస్వస్థత